శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (22:35 IST)

కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. వైస్ కెప్టెన్‌గా జస్‌ప్రీత్ బుమ్రా

భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా అందరూ ఊహించినట్లే రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. ఇప్పటికే వన్డే, టీ20 కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ.. ఇకపై మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా కొనసాగబోతున్నాడు. 
 
వైస్ కెప్టెన్సీ బాధ్యతలు బుమ్రా చేతికి అప్పగించింది బీసీసీఐ. తద్వారా మూడు ఫార్మాట్లలోనూ హిట్‌మ్యానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు.
 
ఇకపోతే, ఈ నెల 24న లక్నో వేదికగా భారత్, శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుండగా.. ఆ తర్వాత ధర్మశాలలో 26, 27న వరుసగా రెండు, మూడో టీ20 మ్యాచ్‌ జరగనుంది. 
 
అనంతరం మార్చి 4 నుంచి మొహాలిలో ఫస్ట్ టెస్టు, మార్చి 12 నుంచి బెంగళూరులో రెండో టెస్టు జరగనుంది. మొహాలి టెస్టు కోహ్లీకి కెరీర్‌లో 100వ టెస్టుకానుంది.