సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఫిబ్రవరి 2022 (21:55 IST)

శ్రీలంకతో టీ-20 సిరీస్: విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్‌లకు విశ్రాంతి

మార్చి 4 నుంచి శ్రీలంకతో జరిగే టెస్ట్ సిరీస్‌తో రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టనున్నాడు. సౌతాఫ్రికాతో​ టెస్ట్‌ సిరీస్‌ ఓటమి అనంతరం భారత టెస్ట్‌ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్‌ కోహ్లీ స్వయంగా తప్పుకున్న విషయం తెలిసిందే.  
 
ఇక రెండు టెస్ట్‌ల సిరీస్‌కు మాత్రం రిషభ్ పంత్, కోహ్లీ అందుబాటులో ఉండనున్నారు. కేఎల్ రాహుల్ గైర్హాజరీలో ప్రియాంక్ పాంచల్‌తో పాటు మాయంక్ అగర్వాల్‌కు అవకాశం దక్కింది. గాయంతో దూరమైన శుభ్‌మన్ గిల్, విశ్రాంతిలో ఉన్న మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. 
 
ఇకపోతే.. ఫిబ్రవరి 24 నుంచి లక్నో, ధర్మశాల వేదికగా మూడు టీ20ల సిరీస్ జరగనుండగా.. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్‌లకు విశ్రాంతినిచ్చారు. ఇషాన్ కిషన్‌ జట్టులో కొనసాగించగా.. అతనికి బ్యాకప్‌గా సంజూ శాంసన్‌కు అవకాశం కల్పించారు. 
 
శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌తో పాటు వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్‌, దీపక్ హుడాలను కొనసాగించారు. గాయంతో సౌతాఫ్రికా, వెస్టిండీస్‌తో సిరీస్‌లకు దూరమైన రవీంద్ర జడేజా ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. విశ్రాంతిలో ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా కూడా తిరిగి వచ్చాడు.