విదేశీ ప్రయాణికులకు కేంద్రం శుభవార్త
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు నిర్బంధంగా ఉన్న కోవిడ్ నిర్ధారణ కోసం నిర్వహించే ఆర్టీపీసీఆర్, స్వాబ్ పరీక్షలు, 14 రోజుల క్వారంటైన్ నిబంధనను తొలగించింది. ఈ మేరకు కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది.
అయితే, ప్రయాణినికి 72 గంటల ముందు చేయించుుకన్న ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్టుతో పాటు.. వ్యాక్సినేషన్ పూర్తయినట్టు నిర్ధారించే సర్టిఫికేట్‌ను జతచేస్తే సరిపోతుందని పేర్కొంది. ఈ కొత్త మార్గదర్శకాలు ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
అలాగే, భారత్‌లో అడుగుపెట్టిన ర్వాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకుని దాన్ని సువిధ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలన్న నిబంధనను ఎత్తివేసింది. అలాగే, ప్రస్తుతం ఉన్న ఏడు రోజుల క్వారంటైన్ నిబంధనలను ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే, 14 రోజుల పాటు స్వీయ రక్షణ చర్యలు పాటించాలని కేంద్రం తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో జారీచేసింది.