శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (16:44 IST)

సహజ నటి జయసుధకు కరోనా.. అమెరికాలో చికిత్స

ప్రపంచ దేశాలను కరోనా పట్టిపీడిస్తోంది. దేశంలోనూ కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో సినీ ఇండస్ట్రీ నుంచి సామాన్య ప్రజల వరకు కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా సహజనటి జయసుధ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. 
 
అనారోగ్యంతో అమెరికాలో చికిత్స తీసుకుంటున్న జయసుధ కొద్దిగా కోలుకున్నారని సంతోషపడేలోపు ఈ మహమ్మారి ఆమెను పట్టుకున్నట్లు సమాచారం అందుతోంది.
 
ప్రస్తుతం జయసుధ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇక జయసుధ ఇటీవల సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే.