శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (16:57 IST)

"30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అని నేర్పించింది.. అకౌంట్ హ్యాక్ అయ్యిందట!

హీరోయిన్ అమ్రిత అయ్యర్​ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​ హ్యాక్​ అయ్యినట్లు తెలిసింది. బుల్లితెర యాంకర్ ప్రదీప్‌తో కలిసి "30 రోజుల్లో ప్రేమించడం ఎలా" అని నేర్పించిన అమ్రిత అయ్యర్.. ఇటీవల శ్రీ విష్ణు సరసన అర్జున ఫల్గుణ చిత్రంలో నటించి మెప్పించింది. ప్రస్తుతం అమ్రిత.. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "హనుమాన్" చిత్రంలో నటిస్తుంది.
 
నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె.. ప్రస్తుతం సోషల్ మీడియాకు దూరంగా వుంది. కారణం ఏంటని ఆరా తీస్తే ఆమె ఇన్‌స్టా అకౌంట్ హ్యాక్ అయ్యిందని తెలుస్తోంది. 
 
తాజాగా ఈ విషయాన్నీ ఆమె కూడా ద్వారా అభిమానులకు తెలిపింది. "అవును.. నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. అది మళ్లీ రికవరీ అవుతుందని అనుకుంటున్నాను. త్వరలోనే మళ్లీ కలుస్తాను” అంటూ ట్వీట్ చేసింది.