సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (19:54 IST)

సికిందర్‌ రజా సరికొత్త చరిత్ర- వరుసగా మూడు సెంచరీలు

Sikandar Raza
Sikandar Raza
జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికిందర్‌ రజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆగస్టు నెలకు గానూ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డును సికిందర్‌ రజా దక్కించుకున్నాడు. తద్వారా ఈ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్న తొలి జింబాబ్వే క్రికెటర్‌గా రజా నిలిచాడు. 
 
ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ది మంత్‌ అవార్డు విజేతలను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ సోమవారం ప్రకటించింది. పురుషుల విభాగంలో రజాకు.. మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మెక్‌గ్రాత్‌కు ఈ అవార్డు లభించింది.
 
స్వదేశంలో బంగ్లాదేశ్‌, భారత్‌తో వన్డే సిరీస్‌లో రజా సెంచరీలు మోత మోగించాడు. వరుసగా మూడు అంతర్జాతీయ సెంచరీలు సాధించాడు. బం‍గ్లాదేశ్‌పై రెండు సెంచరీలు చేయగా.. భారత్‌పై ఒక సెంచరీని నమోదు చేశాడు.