శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (21:48 IST)

మూడో వన్డేలో భారత్‌కు ముచ్చెమటలు... ఎట్టకేలకు సిరీస్ క్లీన్ స్వీప్

subhmangill
జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు సోమవారం మూడో వన్డే మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే బౌలర్లు భారత ఆటగాళ్లకు ముచ్చెమటలు పట్టించారు. అయినప్పటికీ విజయం మాత్రం భారత్‌నే వరించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 289 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులో ధవన్ 40, రాహుల్ 30, గిల్ 130, కిషన్ 50, హుడా 1, శాంసన్ 15, అక్సర్ పటేల్ 1, ఠాకూర్ 5, డీ చాహర్ 1, కుల్దీప్ యాదవ్ 2 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఇందులో శుభమన్ గిల్ తన అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. మొచ్చం 82 బంతుల్లో సెంచరీ పూర్తిచేశాడు. 
 
ఆ తర్వాత 290 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు 49.3 ఓవర్లలో అన్ని వికెట్లను కోల్పోయి 276 పరుగులు చేసింది. దీంతో 13 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. భారత బౌలర్లలో చాహర్, కుల్దీప్ యాదవ్, అక్సర్ పటేల్‌లు తలా రెండేసి వికెట్లు తీయగా, అవేశ్ ఖాన్ మూడు, శార్దూల్ ఠాకూర్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు.