బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (18:38 IST)

#boycottliger విజయ్ దేవరకొండకు అహంకారమా?

Liger
#boycottliger అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విజయ్ దేవరకొండ లైగర్‌ను బాయ్‌కాట్ చేయాలని నెటిజన్లు అంటున్నారు. లైగర్‌ను దేశంలోని ప్రజలు బహిష్కరించాలి. ఎందుకంటే విజయ్ దేవరకొండకు  చాలా అహంకారం ఉంది. ఈ చిత్రాన్ని యాంటీ ఇండియా గ్యాంగ్ నిర్మించింది. కాబట్టి ఐక్యంగా ఉండండి.. సాధారణ ప్రజల ఐక్యతను అతనికి చూపించండి.. అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు స్పందించారు. 
 
#boycottliger భారతదేశ ప్రజలు ఆగస్ట్ 25న అసలు సీనేంటో చూపిస్తారు. అహంకార స్థాయి మరీ ఎక్కువగా ఉంటే, భారత ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్తారని.. liger నటుడు బహిష్కరణకు అర్హుడు అంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆగస్టు 25 లైగర్ ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంటాడో తెలియాలంటే వేచి చూడాలి.