శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 22 ఆగస్టు 2022 (10:59 IST)

దేశంలో కొత్తగా 9 వేల కరోనా పాజిటివ్ కేసులు

coronavirus
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. అయితే, గతంతో పోల్చితే ఈ కేసుల సంఖ్య తక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9 వేలకు దిగువన కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో గత 24 గంటల్లో 9,531 మందికి ఈ వైరస్ సోకింది. 
 
ఈ కేసులతో కలుపుకుంటే మొత్తం కేసుల సంఖ్య 4,43,48,960కు చేరింది. ఈ వైరస్ బాధితుల్లో 4,37,23,944 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,27,368 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 97,648 మంది యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 36 మంది కరోనాకు మృత్యువాతపడగా, 11,726 మంది కోలుకున్నారు. 
 
అలాగే, ప్రస్తుతం దేశంలో ఉన్న మొత్తం కేసుల్లో 0.22 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే రికవరీ రేటు 98.59 శాతంగా ఉంది. మరణాల శాతం 1.19 శాతంగా ఉందని పేర్కొంది. ఇప్పటివరకు 210.02 కోట్ల మందికి కరోనా టీకాలు పంపిణీ చేశారు.