ఆదివారం, 5 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (21:33 IST)

ట్వంటీ-20 ప్రపంచ కప్‌.. జస్ప్రీత్ బుమ్రా అవుట్... బీసీసీఐ ప్రకటన

Bumrah
Bumrah
వెన్నులో ఏర్పడిన గాయం కారణంగా జస్ప్రీత్ బుమ్రా ట్వంటీ-20 ప్రపంచ కప్‌కు దూరమైనట్లు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే వెన్నులో గాయం కారణంగా దక్షిణాఫ్రికా సిరీస్‌కు దూరమైన బుమ్రా.. టీ-20 ప్రపంచ కప్‌లో ఆడుతాడో లేదో అనే అనుమానం నెలకొంది. అయితే బీసీసీఐ ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేసింది. 
 
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా టి20 ప్రపంచకప్ నుంచి బుమ్రా తప్పుకోలేదని మొన్నటికి మొన్న ప్రకటించాడు. అయితే తాజాగా బుమ్రా  గాయం ఎక్కువగా ఉందని.. అతడు టి20 ప్రపంచకప్ లోపు కోలుకోవడం కష్టమని డాక్టర్లు సూచించినట్లు తన ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ మేరకు బుమ్రాను టి20 ప్రపంచకప్ నుంచి తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారికంగా స్పష్టం చేసింది. జస్ ప్రీత్ బుమ్రా టి20 ప్రపంచకప్ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో సెలెక్టర్లు ఎవర్ని ఎంపిక చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.