మంగళవారం, 16 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2022 (17:32 IST)

ఆర్‌.ఆర్‌.ఆర్‌. టీమ్‌కు స్వాగ‌తం ప‌లికిన జ‌పాన్ అభిమానులు

Ramcharan, Rajamouli, N.T.R.
Ramcharan, Rajamouli, N.T.R.
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా ప్ర‌పంచ‌స్థాయికి ఆక‌ర్షించింది. ఈ సినిమాతో మ‌రింత ప్రాచుర్యం పొందిన రాజ‌మౌళి. త‌న‌తోపాటు ఎన్‌.టి.ఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ను పేరు వ‌చ్చేలా చేశారు. ఈ సినిమాను జపాన్‌లో విడుద‌ల‌చేసే ప‌నిలో వున్నారు. అందులో భాగంగా ఈరోజు జపాన్‌లోని టోక్యో న‌గ‌రంలో ప‌ర్య‌టించారు.
 
Rama Rajamouli, Lakshmi Pranathi, Upasana Konidela
Rama Rajamouli, Lakshmi Pranathi, Upasana Konidela
రాజ‌మౌళి, ర‌మా రాజ‌మౌళి, ఎన్‌.టి.ఆర్‌., ల‌క్ష్మీప్ర‌ణ‌తి, రామ్‌చ‌రణ్‌, ఉపాస‌న కొణిదెల సంయుక్తంగా క‌లిసి వెళ్ళారు. జ‌పాన్‌లోని ప‌లు ప్రాంతాల‌ను వారు ప‌ర్య‌టించారు. ముఖ్యంగా రామ్ చరణ్ తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి జపాన్‌లోని టోక్యోలోని ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్‌ను సందర్శించారు,

charan-upasna
charan-upasna
అక్కడ విద్యార్థులు అతనికి ఘన స్వాగతం పలికారు మరియు స్టార్‌తో గొప్ప సమయాన్ని గడిపారు. పిల్ల‌లైతే మ‌గ‌ధీర అంటూ చ‌ర‌ణ్‌కు జిందాబాద్‌ల‌తో ప‌లుక‌రించారు.
 
charan, upasana with tokyo students
charan, upasana with tokyo students
ఇక రాజ‌మౌళికి అక్క‌డివారు మ‌రింత ఆద‌ర‌ణ చూపించారు. ఎన్‌.టి.ఆర్‌, అక్క‌డి ఓ స్కూల్‌ను సంద‌ర్శించారు. అక్క‌డ వారిలో మ‌హిళ‌లు ఎక్కువ‌గా వున్నారు. వారంతా ఆయ‌న‌తో ఫొటోలు తీయించుకునేందుకు ఆస‌క్తి చూపారు. కొంద‌రైతే మ‌రింత ద‌గ్గ‌ర‌గా చూసిన ఆనందంలో ఆనంద బాష్పాలు రాల్చారు. ఇదంతా రాజ‌మౌళి చూస్తూ వారి ప్రేమ‌కు త‌న్మ‌యం చెందారు.