బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: శుక్రవారం, 21 అక్టోబరు 2022 (16:30 IST)

బీజేపీకి దాసోజు శ్రవణ్ రాజీనామా

sravan
ఫోటో కర్టెసీ-ఫెస్ బుక్
మునుగోడు ఉప ఎన్నిక ముందు దాసోజు శ్రవణ్, బీజేపీ నుంచి తప్పుకున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానంటూ తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఆయన లేఖ పంపించారు.

 
మునుగోడులో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు జుగుప్సాకరంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. అనేక అశయాలతో బీజేపీలో చేరిన తనకు తక్కువ కాలంలోనే బీజేపీలోని దశాదిశ లేని నాయకత్వ ధోరణుల గురించి తెలిసిపోయిందని లేఖలో ప్రస్తావించారు.

 
పార్టీ తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ బీజేపీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో శ్రవణ్, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. తాజాగా బీజేపీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు.