ఆదివారం, 24 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 అక్టోబరు 2022 (18:38 IST)

మునుగోడు ఉపపోరు : బీజేపీ అభ్యర్థి తరపున జీవిత ప్రచారం

Jeevitha
బీజేపీ మహిళా నేత, సినీ నటి నటి జీవిత నల్గొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
 
ప్రచారం అనంతరం సీనియర్ నటి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. గురువారం ఉదయం నుంచే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జీవిత... రాజగోపాల్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. 
 
'నియోజకవర్గంలోని ప్రజలకు బీజేపీ అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. తెరాస, కాంగ్రెస్‌ పార్టీల తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని ఆమె హితవు పలికారు. అధికార పార్టీ నేతలు కొందరు వ్యక్తులపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆరోపించారు. 
 
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి లోపాలను ఎత్తిచూపేందుకు కృషి చేసినందున ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధిస్తారు.