గురువారం, 2 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated: శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:34 IST)

కడప విద్యార్థినికి అపురూప అవకాశం

Kadapa
Kadapa
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పట్టణానికి చెందిన యువతికి అపరూప అవకాశం లభించింది. అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకుని పార్లమెంటులో గాంధీపై ప్రసంగించే అరుదైన అవకాశాన్ని దక్కించుకుంది. ఆ విద్యార్థిని పేరు మిద్దె రూప. 
 
కొండాపురం మండలం కోడూరు చెందిన మిద్ద రూప కడపలోని కోటిరెడ్డి మహిళా కాలేజీలో ఈ యేడాది డిగ్రీ పూర్తి చేసింది. జిల్లా, రాష్ట్ర స్థాయిలో పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపర్చడంతో రూపకు అపురూపమైన అవకాశం వరించింది. ఈ విషయాన్ని నెహ్రూ యువ కేంద్ర జిల్లా కోఆర్డినేటర్ కె.మణికంఠ తెలిపారు.