శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2022 (15:50 IST)

కాశ్మీర్ ప్రత్యేక దేశమా..?

jammu-kashmir
బీహార్ లో ఓ స్కూలు యాజమాన్యం ప్రశ్నాపత్రం తయారు చేయడం వివాదాస్పదంగా మారింది. కాశ్మీర్ ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ ఆ ప్రశ్నాపత్రం వుంది. అయితే ఇది మాన్యువేల్ మిస్టేక్ అని ఆ రాష్ట్ర విద్యాశాఖ వివరణ ఇచ్చింది. అయితే, నితీశ్ కుమార్ ప్రభుత్వం, ఆయన పార్టీ జనతాదళ్(యునైటెడ్) లు కశ్మీర్ ను మనదేశంలోని భూభాగంగా గుర్తించట్లేదా? అంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
 
బీహార్ లోని ఓ స్కూల్ లో ఏడో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ తరగతి ప్రశ్నాపత్రంలో రెండు మార్కుల ప్రశ్నలో  చైనా, నేపాల్, ఇంగ్లాండ్, ఇండియాలతో పాటు కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా పేర్కొన్నారు. కశ్మీర్ దేశస్తులను ఏమంటారని ప్రశ్న కనిపించడంతో విద్యార్థులు షాకయ్యారు. ఈ విషయం బయటకు పొక్కడంతో బీజేపీ నేతలు నితీశ్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.