గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (12:26 IST)

జమ్మూకాశ్మీర్ పూంఛ్ జిల్లాలో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

road accident
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారు. ఈ రాష్ట్రంలోని పూంఛ్ జిల్లాలో ఈ ప్రమాదం జిరగింది. మండి నుంచి షాజియాన్ వెళుతున్న మినీ స్సు ఒకటి డ్రైవర్ కంట్రోల్ కోల్పోయి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 11 మంది చనిపోయారు. 
 
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజన్ సిన్హా ప్రకటించారు. ప్రమాదస్థలంలో సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరిలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.