శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 25 మే 2022 (10:55 IST)

బ్రేక్ ఫెయిల్.. బస్సు బోల్తాపడటంతో ఆరుగురి మృతి

road accident
ఒరిస్సా రాష్ట్రంలో ఘోరం జరిగింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ బస్సు బోల్తాపడింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇంకా 42 మంది గాయపడ్డారు. 
 
మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గంజామ్ - కందమాల్ సరిహద్దుల్లో కళింగ ఘాట్ వద్ద ప్రైవేట్ టూరిస్ట్ బస్సుకు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి  బోల్తాపడటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
 
ఈ ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.