గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 17 మే 2022 (19:44 IST)

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురి మృతి

road accident
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు కారులోనే సజీవ దహనమయ్యారు. 
 
ప్రకాశం జిల్లాలోని తిప్పాయపాలెం వద్ద టైర్ పంక్చర్ కావడంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఊహించని పరిణామం నుంచి వారు తేరుకునేలోపు మంటల్లో కాలిపోయారు. 
 
ప్రమాదం జరిగిన తర్వాత ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్‌లు ఘటనా స్థలం నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపకదళ సిబ్బందితో అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.