సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 22 ఏప్రియల్ 2022 (14:32 IST)

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురి సజీవదహనం

car burnt
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కారు బోల్తాపడటం వల్ల చెలరేగిన మంటల్లో కాలి ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదం రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. 
 
వేగంగా వెళులుతున్న కారు ఒకటి ఓ కల్వర్టును ఢీకొనడంతో బోల్తాపడింది. ఆ వెంటనే కారు నుంచి మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మృతుల వివరాలు తెలియాల్సివుంది. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు తీసుకున్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.