శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 మే 2022 (16:35 IST)

కారు ప్రమాదానికి గురైన నటి తనుశ్రీ దత్తా

Tanushree Dutta
బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా కారు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయినిలోని మహాకాల్ ఆలయాన్ని సందర్శించడానికి వెళుతుండగా ఆమె కారు బ్రేకులు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై తనుశ్రీ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్‌ను షేర్ చేసింది.

 
గాయపడిన తర్వాత కూడా మహాకాల్ ఆలయ దర్శనం చేసుకుంది. నా మొదటి రోడ్డు ప్రమాదం అంటూ 
సోషల్ మీడియాలో పోస్ట్‌ను పంచుకుంటూ, తనుశ్రీ ఇలా రాసింది, "ఈ రోజు నా జీవితంలో మొదటి రోడ్డు ప్రమాదం జరిగింది. అది నా విశ్వాసాన్ని బలపరిచింది.
Tanushree Dutta

 
ఈ రోజు నాకు చాలా సాహసోపేతమైన రోజు. ప్రమాదం జరిగినప్పటికీ నేను మహాకాళుని దర్శనం చేసుకున్నాను. గుడికి వెళుతుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో నా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం కారణంగా నా గాయానికి కొన్ని కుట్లు పడ్డాయి. మహాకాళేశ్వర్ దయతో స్వల్ప గాయాలతో బయటపడ్డాను" అని వెల్లడించింది.