శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:45 IST)

తోటి విద్యార్థినికి కూల్‌డ్రింక్స్ ఇచ్చాడు.. మత్తులో వుండగా ఆ పని చేశాడు..

soft drinks
మహిళలపై వయోబేధం లేకుండా అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. వావివరుసలు మరిచి కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా పెద్దదోర్నాలలో దారుణ చోటుచేసుకుంది. తోటి విద్యార్థి విద్యార్థిని పట్ల కిరాతకుడిగా మారాడు. 
 
మత్తుమందు కలిపిన శీతలపానీయాన్ని విద్యార్థిని చేత తాగించాడు. ఆపై విద్యార్థిని  నగ్నచిత్రాలను సెల్ ఫోనులో చిత్రీకరించాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగి..  విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. 
 
వివరాల్లోకి వెళితే.. ప్రకాశం, పెద్దదోర్నాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన నాగూర్ డిప్లొమా చదువుతున్నాడు. ఇతడు మరో గ్రామానికి చెందిన విద్యార్థినిని స్నేహితురాలు బర్త్ డే పార్టీ కంటూ పిలిచాడు. అలా మార్కాపురం తీసుకెళ్లాడు.
 
అక్కడ ఆమెకు శీతల పానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. స్పృహ తప్పడంతో విద్యార్థినిని వివస్త్రను చేసి సెల్ ఫోనులో నగ్నచిత్రాలను తీశాడు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు విద్యార్థిని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో నాగూర్ మీరావలిని అరెస్ట్ అయ్యాడు.