గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , గురువారం, 27 జనవరి 2022 (16:09 IST)

కందుకూరును నెల్లూరులో క‌ల‌ప‌డం ఏంటి? ప్ర‌కాశంలో అసంతృప్తి సెగ‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌భుత్వం కొత్త జిల్లాల విభ‌జ‌న కొన్ని చోట్ల తీవ్ర వివాదాల‌ను సృష్టిస్తోంది. పార్ల‌మెంటు నియోజ‌క‌వర్గాల ప్రాతిప‌దిక‌న విభ‌జ‌న జ‌ర‌గ‌డంతో కొన్ని న‌గ‌రాలు, గ్రామాల వారు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.
 
 
కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రకాశం జిల్లాలో అసంతృప్తి సెగలు క‌మ్ముకుంటున్నాయి. కందుకూరును నెల్లూరు జిల్లాలో కలపడంపై తీవ్ర వ్యతిరేకత వ‌స్తోంది. కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. కందుకూరు డివిజన్‌ను యథాతథంగా ఉంచాలని అఖిలపక్షం నేడు డిమాండ్ చేసింది. మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని కోరుతున్నారు. దీనిపై ఆందోళనలు, ఉద్యమానికి మార్కాపురం జిల్లా సాధన సమితి సిద్ధమవుతోంది. సాయంత్రం కార్యాచరణను జిల్లా సాధన సమితి ప్ర‌క‌టించ‌నుంది.