ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 మే 2022 (12:26 IST)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం - రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి

road accident
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని సిద్ధార్థ్ నగర్ జిల్లాలో ఆగివున్న ట్రక్కును వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడకిక్కడే మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
వీరంతా బంధువుల ఇంట జరిగిన ఓ అంత్యక్రియలకు హాజరై తిరిగి తమ సొంతూరుకు వెళుతుండగా ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, డ్రైవర్ అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించారు. 
 
కాగా, ఈ ప్రమాదం తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి అందజేయాల్సిందిగా ప్రధాని మోడీ తన కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు.