మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (17:55 IST)

కేన్స్ రెడ్ కార్పెట్‌పై ఉక్రెయిన్ మహిళ.. ఉలిక్కిపడిన సిబ్బంది

Cannes 2022
Cannes 2022
కేన్స్ రెడ్ కార్పెట్ మీద సినీ నటులు, హీరోయిన్లు, ప్రముఖుల సందడితో ఆహ్లాదంగా సాగుతున్న సినీ పండుగలో ఒక్కసారిగా ఉలికిపాటు కలిగింది. ఉక్రెయిన్‌కు చెందిన ఓ మహిళ రెడ్ కార్పెట్ పైకి వచ్చి.. తన ఒంటి మీదున్న దుస్తులను విప్పేసింది. 
 
తమపై అత్యాచారాలు ఆపండి అంటూ ఒంటిపై ఆమె రాసుకొచ్చింది. ఉక్రెయిన్ జాతీయ పతాకాన్ని ఆమె తన ఒంటిపై వేసుకుంది. అంతేకాదు.. ఆమె తమపై అత్యాచారాలు ఆపాలంటూ నినదిస్తూ గళాన్నీ వినిపించింది. 
 
వెనువెంటనే స్పందించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను బయటకు తీసుకెళ్లిపోయారు. ఒంటి మీద వస్త్రాలు కప్పారు. దీనిపై కేన్స్ అధికారిక బృందం ఇంకా ఎలాంటి స్పందనా తెలియజేయలేదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉక్రెయిన్‌కు సంఘీభావంగా ఆ దేశానికి చెందిన సినిమాలనూ ప్రదర్శిస్తున్నారు.