శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 మే 2022 (20:01 IST)

ఉక్రెయిన్‌లో పాఠశాలపై రష్యా బాంబు దాడి - 60 మంది మృతి

bomb attack
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య భీకరంగా యుద్ధం సాగుతోంది. అమెరికా సమకూర్చిన ఆయుద్ధాలతో ఉక్రెయిన్ బలగాలు రష్యా సేనలకు ముప్పతిప్పలు పెడుతున్నారు. నల్ల సముద్రం ప్రాంతంలో స్నేక్ ఐలాండ్ వద్ద లంగరు వేసిన రష్యా యుద్ధనౌకను ఉక్రెయిన్ సేనలు క్షిపణితో పేల్చివేశాయి. 
 
ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లో రష్యా సేనలు ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డాయి. బైలోహారివ్కా గ్రామంలో పాఠశాలపై రష్యా సైన్యం బాంబు దాడి జరిపింది. ఈ దాడిలో 60 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై లుహాన్స్క్ గవర్నర్ సైర్హీ గైడాయ్ స్పందించారు.
 
రష్యా సైనికులు శనివారం మధ్యాహ్నం ఓ పాఠశాల భవనంపై బాంబును జారవిడిచాయని వెల్లడించారు. ఆ సమయంలో పాఠశాలలో 90 మంది వరకు ఆశ్రయం పొందుతున్నారని వెల్లడించారు. బాంబు దాడితో స్కూలు నేలమట్టమైనట్టు తెలిపారు. కొన్ని గంటలపాటు శ్రమించి శిథిలాల కింద చిక్కుకున్న క్షతగాత్రులను రక్షించినట్టు చెప్పారు.