శుక్రవారం, 8 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (11:32 IST)

ఈ టైమ్‌లో గనుక అమెరికా ప్రెసిడెంట్‌గా ఉండివుంటేనా... ట్రంప్

donald trump
ఉక్రెయిన్‌ దేశంపై రష్యా సాగిస్తున్న యుద్ధకాండపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ సమయంలో గనుక తాను శ్వేతసౌథం అధ్యక్షుడుగా ఉన్నట్టయితే రష్యాగా గట్టిగా గుణపాఠం జరిగివుండేవాడినని ఆయన హెచ్చరించారు. 
 
ముఖ్యంగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తరచుగా అణ్వాయుధం అనే పదాన్ని వాడుతున్నారు. ఈ పదాన్ని వాడరాదని పుతిన్‌ను గట్టిగా హెచ్చరించేవాడినని చెప్పారు. ప్రతి రోజూ పుతిన్ అణ్వాయుధ ప్రస్తావన తీసుకొస్తున్నారని, దీంతో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారని చెప్పారు. అందుకే అణ్వాయుధ పదాన్ని పదేపదే ప్రస్తావించరాదని పుతిన్‌ను గట్టిగా హెచ్చరించివుండేవాడినని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.
 
అమెరికా వద్ద రష్యా కంటే అధికంగా ఆయుధ సంపత్తి ఉందని, తాము మరింత శక్తిమంతమైన వాళ్ళమని గుర్తుచేశారు. ఈ విషయాన్ని తెలుసుకోవాలని పుతిన్‌కు హితవు పలికేవాడినని ట్రంప్ వెల్లడించారు.