శుక్రవారం, 13 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (16:11 IST)

తీవ్రస్థాయిలో దెబ్బతిన్న రష్యా నౌక

Russia
Russia
ఆయుధ వ్యవస్థలతో ప్రయాణీస్తున్న రష్యా నౌక తీవ్రస్థాయిలో దెబ్బతింది. అందుకు తామే కారణమని ఉక్రెయిన్ ప్రకటించింది. ఆ రష్యా యుద్ధనౌకపై తమ బలగాలు మిస్సైల్ ను ప్రయోగించాయని పేర్కొంది. 
 
రష్యాకు చెందిన 'మాస్క్వా క్రూజ్' నౌక ఉక్రెయిన్ తీరానికి చేరుకోగానే, తమ దళాలు క్షిపణితో దాడి చేశాయని ఒడెస్సా గవర్నర్ తెలిపారు. అయితే, రష్యా ఈ ప్రకటనను ఖండించింది. 
 
యుద్ధనౌకలో జరిగిన పేలుడు కారణంగానే నష్టం వాటిల్లిందని వెల్లడించింది. నౌకలోని సిబ్బందికి ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, వారిని సురక్షితంగా వెలుపలికి తరలించినట్టు రష్యా అధికారులు తెలిపారు.