గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఏప్రియల్ 2022 (08:36 IST)

ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడి ఖాయం : బ్రిటన్ ఇంటెలిజెన్స్

Russia-Ukraine war
ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడి చేయడం ఖాయమని బ్రిటన్ నిఘా వర్గాలు హెచ్చరించాయి. అదేసమయంలో ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదని అభిప్రాయపడ్డాయి. అందువల్ల ఉక్రెయిన్‌పై రష్యా అణుదాడికి పాల్పడవచ్చని పేర్కొంది. 
 
అదేసమయంలో ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ యుద్ధం ముగింపు దిశగా మాత్రం ప్రయత్నాలు లేదా అడుగులు పడటం లేదని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 
 
ఇదిలావుంటే, ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు భీకర పోరు సాగిస్తున్నాయి. ఇందులోభాగంగా, మరియాపోల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన ప్రాంతాలను కైవసం చేసుకునేందుకు వీలుగా భీకర పోరు సాగించే అవకాశం ఉందని బ్రిటన్ నిఘా వర్గాలు హెచ్చరించారు. 
 
ముఖ్యంగా, ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడికి పాల్పడే అవకాశం ఉందని బ్రిటన్ బాంబులాంటి వార్తను వెల్లడించింది. ఈ అణు ఏ క్షణమైనా జరగొచ్చని తెలిపింది. బ్రిటన్ నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.