బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 18 ఏప్రియల్ 2022 (09:02 IST)

పెద్దమ్మగా నారా లోకేష్‌కు ఆశీస్సులు ఉంటాయి : పురంధేశ్వరి

purandheswari
పెద్దమ్మగా తన సోదరి భువనేశ్వరి కుమారుడు నారా లోకేష్‌కి తన ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని భారతీయ జనతా పార్టీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. మీడియాతో మాట్లాడిన దగ్గుబాటి పురంధేశ్వరి.. లోకేష్ తల్లి సోదరిగా తన ఆశీస్సులు తనకు ఎప్పుడూ ఉంటాయన్నారు. పైగా, నారా లోకష్‌ తన సొంతమార్గంలో ప్రయాణించే సత్తా ఉందన్నారు. 
 
తన భర్త, కొడుకు వైఎస్సార్‌సీపీలో లేరని, చాలా కాలం క్రితమే ఆ పార్టీ నుంచి వైదొలిగారని ఆమె స్పష్టం చేశారు. తన కుమారుడి నిర్ణయాన్ని తాను ఎప్పటికీ వ్యతిరేకించబోనని, గతంలో రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు వ్యాపారం చేయాలనుకుంటున్నానని పురంధేశ్వరి వివరణ ఇచ్చారు.