బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

'ఆర్ఆర్ఆర్'కు సీక్వెల్ - స్టోరీ డిస్కర్షన్స్ జరుగుతున్నాయ్...

rrr movie still
హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరక్కిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు "బాహుబలి" రెండు భాగాలుగా వచ్చి రెండుసార్లు రూ.1000 కోట్ల మార్కును టచ్ చేసింది. అలాగే, "ఆర్ఆర్ఆర్" కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.
 
అయితే, ఇపుడు "ఆర్ఆర్ఆర్‌"కు సీక్వెల్ రానుంది. దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని దర్శకుడు రాజమౌళి తెలిపారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీని సిద్ధంచేసే పనిలో ఉన్నట్టు చెప్పారు. కాగా, ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో "ఎస్ఎస్ఎంబీ-29"ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. 
 
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ  చిత్రం పూర్తయిన తర్వాతే "ఆర్ఆర్ఆర్" సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అంటే ఎటు చూసినా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ రావాలంటే కనీసం మరో రెండేళ్లు ఆగక తప్పదు.