గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 అక్టోబరు 2022 (11:46 IST)

రాజమౌళికి పుట్టినరోజు.. జక్కన్నలోని స్పెషాలిటీస్ ఇవే..

SS Rajamouli
జక్కన్న రాజమౌళికి ఈరోజు పుట్టినరోజు. బాహుబలి అనే కళాఖండంతో ప్ర‌పంచం త‌న వైపు చూసేలా చేసుకున్న రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  
 
బాహుబ‌లి ది బిగినింగ్‌, బాహుబ‌లి క‌న్‌క్లూజ‌న్ చిత్రాల‌తో ఇండియన్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ రికార్డుల‌ను తారుమారు చేసే ప్ర‌పంచం త‌న వైపు చూసేలా చేసుకున్నారు. ఈ ఏడాది విడుద‌లైన ఆర్ఆర్ఆర్‌తో మ‌రో సెన్సేష‌న్‌కు తెర తీశారు. 
 
ఇప్పుడు ప‌న్నెండు వంద‌ల కోట్ల‌కు పైగానే వ‌సూళ్లను సాధించిన ఈ చిత్రం టాలీవుడ్ హిస్ట‌రీలో మ‌రో మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. త‌దుప‌రి సూప‌ర్ స్టార్ మ‌హేష్‌‌తో పాన్ వ‌ర‌ల్డ్ మూవీని భారీ ఎత్తున నిర్మించ‌టానికి సన్న‌ద్ధ‌మ‌వుతున్నారు.
 
ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే RRRతో ఆస్కార్ అవార్డును సాధించడానికి అడుగులు వేసున్నారు జ‌క‌న్న అండ్ టీమ్‌. ఇప్ప‌టికే అమెరికా డిస్ట్రిబ్యూట‌ర్ త‌ర‌పు నుంచి ఆస్కార్ బ‌రిలోకి జ‌న‌ర‌ల్ కేట‌గిరీలో 15 అవార్డుల‌కు RRR పోటీ ప‌డ‌నుంది. 
 
RRR ఆస్కార్ బ‌రిలో నిలిచి అవార్డును సాధిస్తే మ‌రో మారు టాలీవుడ్ గ‌ర్వంగా త‌లెత్తుకుని నిల‌బ‌డుతుంద‌న‌టంలో సందేహం లేదు. ఇలా సినిమా సినిమాకు తెలుగు సినిమా రేంజ్‌ను పెంచుతోన్న మ‌న జ‌క్క‌న్న రాజ‌మౌళి పుట్టిన‌రోజు నేడు (అక్టోబ‌ర్ 10). 
 
స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లతో రాజమౌళి ఎంతటి సంచలనం సృష్టించారో అందరి తెలిసిందే. 
 
రాజమౌళిలోని స్పెషాలిటీస్ ఇవే.. 
తొలుత ప్రకటనలకు డైరక్ట్ చేసేవారు 
అదే జక్కన్నకు తొలి సంపాదన
ప్రకటనలు విజయవంతం అయ్యాక శాంతి నివాసం సీరియల్‌కి పనిచేశారు. 
రోజుకు 18 గంటలపాటు కష్టపడేవారు 
 
ఈ సీరియల్ పూర్తయ్యాక ఏడాదికి రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెంబర్ 1 వచ్చింది.
రాజమౌళి హీరోను దృష్టిలో పెట్టుకుని కథ రాసేందుకే ఎక్కువ ఇష్టపడతారు. 
నటుల నుంచి తనకు కావాల్సిన ఔట్‌పుట్ రాబట్టుకోవటమే తప్ప పూర్తి స్థాయిలో నటించాలంటే రాజమౌళికి నచ్చదు.