గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2022 (19:03 IST)

సుగుణసుందరి పాటలో వీరసింహారెడ్డి, శ్రుతిహాసన్‌ మాస్‌ ఎనర్జీ!

balakrishna, Shruti Haasan
balakrishna, Shruti Haasan
నందమూరి బాలకృష్ణ, శ్రుతిహాసన్‌ నటిస్తున్న చిత్రం వీరసింహారెడ్డి. ఈ చిత్రంలోని సుగుణసుందరి అనే పాటలకోసం విదేశాలకు వెళ్ళి చిత్రించారు. దీనికి సంబంధించిన ఫుల్‌ పాటను డిసెంబర్‌ 15న ఉదయం 9:42 గంటలకు విడుదలచేసేందుకు చిత్ర నిర్మాతలు రంగం సిద్ధం చేశారు. మలినేని గోపీచంద్‌ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
 
ఈ పాటకు సంబంధించిన పోస్టర్‌ విడుదల చేశారు. చాలా ఎనర్జిటిక్‌గా బాలకృష్ణ, శ్రుతిహాసన్‌ డాన్స్‌ వేయడం కనిపిస్తుంది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుంది. థమన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కూడా ముగింపుకు చేరుకుంది. రిషి పంజాబీ కెమెరామెన్‌గా వ్యవహరించారు.  సంక్రాంతి సందర్భంగా 12 జనవరి, 2023న గ్రాండ్‌ రిలీజ్‌ చేయనున్నారు.