గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 డిశెంబరు 2022 (12:46 IST)

వాల్తేరు వీరయ్యలో విక్రమ్‌ సాగర్‌ ఎసిపి.గా రవితేజ ఏం చేశాడు?

Acp vikram sagar
Acp vikram sagar
మెగాస్టార్‌ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య చిత్రంలో రవితేజ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన ఫుల్‌ స్టిల్‌ను ఈరోజు విడుదల చేస్తూ, విక్రమ్‌ సాగర్‌ ఎసిపి.గా రాబోతున్నాడంటూ ట్వీట్‌ చేసింది చిత్ర యూనిట్‌. మాస్‌ పాత్రలు పోషించడంలో విశేష అనుభవం వున్న రవితేజ మాస్‌ హీరో సినిమాలో నటించడం విశేషం కూడా. ఈ సినిమాలో ఎ.సి.పి.గా తనేం చేశాడు? వీరయ్యకు సపోర్ట్‌గా వున్నాడా? వీరయ్యను అరెస్ట్‌ చేస్తాడా అన్నది త్వరలో చూడొచ్చని నిర్మాణ సంస్థ అభిమానులకు వదిలేసింది.
 
సంక్రాంతికి విడులకాబోతున్న ఈ సినిమా అభిమానులకు డబుల్‌ దమాకాగా వుండబోతుంది. రవితేజ పాత్ర తీరును చెబుతూ చిన్న వీడియోను విడుదలచేసింది. ఫస్ట్‌టైం ఒక మేకపిల్లను పులి ఎత్తుకుని వస్తున్నట్లు ఉన్నది అనే డైలాగ్‌ రవితేజ పాత్ర గురించి చెప్పినట్లయింది. ఈ సినిమాలో ఇద్దరూ కలిసి డాన్స్‌ వేసిన పాట హైలైట్‌ అవుతుందని చెబుతున్నారు. దర్శకుడు బాడీ ఈ చిత్రం గురించి పూర్తివివరాలు తెలియజేయలేకపోయినా త్వరలో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో అన్ని విషయాలు తెలియేస్తారని చిత్ర యూనిట్‌ చెబుతోంది. దర్శకుడు బాబీ దర్శకత్వంలో మైత్రీమూవీ మేకర్స్‌ నిర్మించారు.