గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 18 డిశెంబరు 2022 (17:00 IST)

జనసేనలోకి క్యూ కట్టిన వైకాపా నేతలు.. సత్తెనపల్లి వేదిక

janasena
హీరో పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీలో చేరేందుకు వైకాపా నేతలు క్యూకడుతున్నారు. ఇందుకు సత్తెనపల్లి వేదిక అయింది. ఆదివారం జనసేన పార్టీ వేదికగా జరిగిన కౌలు రైతు భరోసా యాత్రను నిర్వహించారు. ఇందులో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వైకాపా నేతలు జనసేన పార్టీలో చేరారు. 
 
కోనసీమ జిల్లా రాజోలుకు చెందిన బొంతు రాజేశ్వర రావు, విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గురాన అయ్యలు, పి.గన్నవరం నియోజకవర్గానికి చెందిన ఏఎంసీ ఛైర్మన్ కొమ్మూరి కొండలరావు జనసేన తీర్థం పుచ్చుకున్నారు వీరికి పవన్ కళ్యాణ్ జనసేన కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. 
 
బొంతు రాజేశ్వరరావు గత ఎన్నికల్లో రాజోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ సర్కారుకు సలహాదారుగానూ వ్యవహరించారు. రాజేశ్వరరావుతో పాటు ఆయన అనుచరులు కూడా జనసేనలో చేరారు. కాగా, ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.