శుక్రవారం, 1 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 3 డిశెంబరు 2022 (21:58 IST)

నేను పరాజయం పొందిన పొలిటీషియన్‌ను: జనసేన అధినేత పవన్

pawan kalyan
సహజంగా పరాజయం పొందిన నాయకులు తాము ఓడిపోయామని చెప్పేందుకు చాలా ఇబ్బందిపడుతుంటారు. ఐతే జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రం తను ఓడిపోయిన నాయకుడినని చెప్పుకునేందుకు ఎలాంటి మొహమాటం లేదని అన్నారు. హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

 
ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ఆయన మాట్లాడుతూ.... పరాజయంలోనే జయం వుంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. నా పరాజయాలు గురించి చెప్పేందుకు నేనేమీ మొహమాటపడను. ఎందుకంటే విజయం అంత సులభంగా రాదు కనుక. విజయం సాధించాలంటే పరాజయాలు ఎదుర్కోక తప్పదు. వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి.

 
డబ్బు వున్నవారంతా గొప్పవారని, పేరున్నవారు మహానుభావులని అనుకోకూడదు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది తెలుసుకుని నిర్ణయించుకోవాలి. వ్యక్తిగతంగా సాధించిన విజయమే దేశానికి పెట్టుబడి'' అని అన్నారు.