సిల్క్ స్మితకు అభిమానిగా హీరో నాని ?
Silk Smitha poster
నాని తాజాగా దసరా అనే సినిమా చేస్తున్నాడు. రగ్గెడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఇందులో ప్రత్యేకంగా సిల్క్‌స్మిత అంశం వుందని తెలుస్తోంది. ఓ మాస్‌సాంగ్‌లో నాని బాగా డాన్స్ చేశాడు. కథాపరంగా సిల్క్‌స్మితకు చెందిన అంశం ఏమిటనేది త్వరలో తెలియనుంది. దసరా బృందం ఆమె జన్మదినోత్సవం సందర్భంగా తరతరాల హృదయ స్పందనను మరియు ఎప్పుడూ మంత్రముగ్దులను చేసే సిల్క్ స్మితని గుర్తు చేసుకుంటు ఓ పోస్టర్ ని ఈరోజు ఆమె జయంతి గుర్తుచేసుకొని విడుదల చేసింది. ఎస్.ఎల్‌వి. సినిమాస్ బేనర్‌లో దసరా రూపొందుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. కీర్తి కథానాయిక.
