శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 30 నవంబరు 2022 (17:00 IST)

అందరి మనసుల్ని దోచేదిగా నిలిచే గుర్తుందా శీతాకాలం : నిర్మాత చింత‌పల్లి రామారావు

Chintapalli Rama Rao
Chintapalli Rama Rao
క‌న్న‌డ‌లో స‌క్స‌స్‌ఫుల్ ద‌ర్శ‌కుడు, న‌టుడైన నాగ‌శేఖ‌ర్ ని తెలుగుకి  "గుర్తుందా శీతాకాలం" తో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని భావ‌న‌ ర‌వి, నాగశేఖర్, రామారావు చింతపల్లి, ఎమ్ ఎస్ రెడ్డి, చిన‌బాబులు సంయుక్తంగా నిర్మించారు.కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబ‌ర్ 9 న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్న సందర్బంగా చిత్ర నిర్మాత చింత‌పల్లి రామారావు పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పారు.
 
మీ నేపథ్యం చెప్పండి?
మాది గుంటూరు జిల్లా నాకు చిన్నప్పటి నుండి  సినిమా అంటే ఇష్టం..చిన్నప్పుడు చిరంజీవి గారి నెగిటివ్ ఫిల్మ్స్ తీసుకొని తెరమీద వెయ్యడం. అలాగే ఆ నెగిటివ్ ఫిల్మ్ షర్ట్ కింద పెట్టి ఐరన్ చేస్తే షర్ట్ మీద చిరంజీవి బొమ్మ పడేది.ఇలా సినిమాపై ప్యాషన్ అనేది అప్పుడే ఏర్పడింది. నా చదువంతా కూడా గవర్నమెంట్ హై స్కూల్, కాలేజ్ లలోనే చదివాను.ఆ తరువాత బెంగళూరు టాప్ టెన్ కాలేజ్ లో ఇంజనీరింగ్ చదివాక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉంటూ ఎలివేటర్స్ బిజినెస్ లో  రాణించి సినిమా మీద ఉన్న ప్యాషన్ తొ ఇండస్ట్రీకి వచ్చాను. సుబ్బారెడ్డితొ కలసి ఆడు మగాడ్రా బుజ్జీ కు అసోసియేట్ గా వర్క్ చేశాను. ఆ తరువాత గజకేసరీ, సమంతతో టెన్ వంటి సినిమాలు డబ్బింగ్ సినిమాలు చేసిన తరువాత ఇప్పుడు "గుర్తుందా శీతాకాలం"’ వంటి స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాను.
 
మీ ఫస్ట్ ప్రొడక్షన్ రీమేక్ ను సెలెక్ట్ చేసుకున్నారు ?
ఇది నేను సెలెక్ట్ చేసుకున్న సినిమా కాదు.ఈ సినిమాను ముందే కమిట్ అయ్యి వాళ్ళు సినిమా స్టార్ట్ చేశారు.అయితే వారు ఫైనాన్సియల్ గా ఇబ్బంది పడుతుంటే వీరు నాకు తెలిసిన వారు కావడంతో నేను టెకోవర్ చేసుకున్నాను.వారి భాగస్వామ్యం తోనే సినిమాను పూర్తి చేశాను.
 
ఈ సినిమా ద్వారా నిర్మాత గా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ?
ఈ సినిమాకు భాగస్వామ్యం గా ఉన్న సుబ్బారెడ్డి 120 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా చేశాడు.వారి సలహాలు తీసుకున్నాను. ప్రతి నిర్మాతకు మొదట కొంత ఇబ్బంది అనిపించినా అనుభవంతో అంతా సెట్ అయ్యి అలవాటు అవుతుంది.
 
సత్యదేవ్ తో మీ జర్నీ ఎలా ఉంది ?
సత్యదేవ్ చాలా మంచి వ్యక్తి. మొదట నుండి చివర వరకు కూడా నేను సెట్స్ కు సరిగా  వెళ్ళక పోయినా అకౌంట్స్ తో సహా ప్రతి విషయం లో మాకు అన్ని విషయాల్లో సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుండి నడిపించాడు.  
 
తమన్నా ను తీసుకోవడానికి కారణమేంటి ?
తమన్నా గారు ప్రొఫెషనల్ యాక్టర్..అంతా కొత్త వారితో చేస్తే మా సినిమా బిజినెస్ కూడా జరగాలి కాబట్టి తనను తీసుకోవడం జరిగింది. ఇందులో తను ఇందులో బాగా చేసింది.
 
డిసెంబర్ 9 న చాలా సినిమాలు ఉన్నాయి మీ సినిమాను ఎన్ని థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నారు ?
డిసెంబర్ 9 న సుమారు 12 సినిమాలు రిలీజ్ కు ఉన్నా కూడా  మా సినిమాను మాత్రం రెండు రాష్ట్రాల్లో 600 థియేటర్స్ లలో రిలీజ్ చేస్తున్నాము.
 
దర్శకుడి నాగశేఖర్ తో  మీ జర్నీ ?
క‌న్నడలో విడుద‌లై సూప‌ర్ హిట్ అయిన ‘ల‌వ్ మాక్‌టైల్’ చిత్రం ఆధారంగా ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరకెక్కించాడు.తను కన్నడలో చాలా హిట్ సినిమాలు చేశాడు.అయితే ఈ సినిమాకు కూడా చాలా కేర్ తీసుకొని  బాగా చేశాడు. తనకు కూడా ఈ సినిమా ద్వారా మంచి పేరు వస్తుంది.
 
మ్యూజిక్ పరంగా ఈ సినిమాకు మంచి పేరు వచ్చింది అందుకు మీరేమి జాగ్రత్తలు తీసుకున్నారు ?
కాల బైరవ అద్భుతమైన మ్యూజిక్ చేశాడు.అన్ని పాటలు  కూడా శ్రీమణి చాలా చక్కగా బావత్మకంగా రాశాడు.డానికి తోడు ఇండియా లోని టాప్ సింగర్స్ అయిన శ్రేయా ఘోషల్, అర్మాన్ మాలిక్, సోనూ నిగమ్ వంటి  పెద్ద సింగర్స్ ఈ సినిమాకు పాడారు.రీ రికార్డింగ్ కూడా ఎమోషన్ కు మించి అద్భుతంగా చేశాడు. ల‌క్ష్మి భూపాల్ అందించి మాట‌లు , స‌త్య అందిచింన విజువ‌ల్స్‌ ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళింది.
 
ఫ్యామిలీ అడియన్స్ ఈ సినిమా చూడడానికి ఇందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి ?
చాలా మంది ఈ టైటిల్ చూసి యూత్ సినిమా అనుకుంటారు. కానీ ప్రతి మనిషి కూడా యవ్వన దశ  నుండి మిడిల్ ఏజ్ వరకు  ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రతి వ్యక్తి కలలు కంటుంటాడు.అయితే అమ్మాయిని సెలెక్ట్ చేసుకొనే విధానంలో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. అలాగే ప్రేమ విషయంలో కూడా ఎన్నో ప్రేమాలు పుడుతుంటాయి. వాటిలో విలువైన ప్రేమలు కొన్నే ఉంటాయి.ఆ విలువైన ప్రేమలు ఎలా ఉండాలి, ఎలా ఉంటాయో, సమాజానికి తగ్గట్టు మనం ఎలా ఉండాలో తెలియజేసే  అద్భుతమైన చిత్రమే  మా "గుర్తుందా శీతాకాలం"’ సినిమా
 
ఇప్పటివరకు ప్రేమ కథలు చాలా వచ్చాయి అయితే ఈ సినిమాలో ఉన్న కొత్తదనం ఏంటి ?
ఇప్పటివరకు వచ్చిన సినిమాలకు ఈ సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉంటుంది.ఎదుటి వారిని మనం ప్రేమించడం, వారినుండి తీసుకోవడం కాదు ఎదుటివారికి మనం ఏమివ్వాలి అని తెలియజేప్పే సారాంశం ఈ సినిమాలో ఉంటుంది. ఈ సినిమా చూస్తుంటే నాగార్జున గారి "గీతాంజలి" సినిమాకు దగ్గరగా ఉంటుంది.
 
"గుర్తుందా శీతాకాలం" అనే టైటిల్ పెట్టడానికి గల కారణమేంటి ?
దీనికి ప్రత్యేకమైన కారణమంటూ ఏమీ లేదు. శీతాకాలం- మంచులో మనుషులు తడిసి ముద్దయ్యే కాలం, చల్లగాలికి పిల్లగాలి తోడయ్యే వెచ్చని కాలం, ఇలా మనిషి కోరుకొనే విధానాన్ని బట్టి ఉంటుంది.సీతాకాలం అనేది డిసెంబర్ లవ్. అయితే శీతాకాలంతో నాకు ప్ర‌త్యేఖ‌మైన ప‌రిచయం లేక‌పోయినా..ఈ శీతాకాలం మాత్రం నాకు ఈ సినిమా గుర్తుండిపోతుంది.
 
ఈ సినిమాకు మీరేమైనా మార్పులు చేర్పులు చేశారా ?
క‌న్నడలో తీసిన ‘ల‌వ్ మాక్‌టైల్’ సినిమా డాక్యుమెంటరీ లాగ వెళుతుంది కానీ కమర్సియల్ గా ఉండదు.అందులో 40% మాత్రమే కథను తీసుకొని కమర్శియల్ తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మంచి ఆర్టిస్టులను పెట్టి ఈ సినిమా తీయడం జరిగింది.ఇంకా ఈ సినిమాలో  త‌మ‌న్నా, మెఘా ఆకాష్‌,  కావ్య శెట్టి లు అద్భుతంగా నటించారు. ఇందులో చాలా మంది నటులు ఉన్నా సినిమాలో పాత్ర‌లు మాత్ర‌మే క‌నిపిస్తాయి. సినిమా అద్భుతంగా వచ్చింది.
 
ఈ సినిమాలో ఉన్న హైలెట్స్ ఏంటి ?
భూమండలాన్ని శాశించేది మనిషి. ఈ మనషుల మధ్య ఉండే ప్రేమే ఈ సృష్టి , మనిషి మనుగడకు చాలా అవసరమైనది ప్రేమ. కాబట్టి  ప్రేమ, సృష్టి సమతుల్యంగా ఉండాలి అంటే సమాజానికి మనం ఎలా అనుగుణంగా ఉండాలి, ఎలా ఉంటే మన మనుగడ ఉంటుంది అనే సారాంశం ఇందులో ఉంటుంది. ఇలాంటి  సంఘ‌ట‌నలు ప్రేక్షకుల‌కి గుర్తు చేసే ఉద్దేశ్యంతో తెరకెక్కిన చిత్రమే 'గుర్తుందా శీతాకాలం".ఈ సినిమాలో మూడు ల‌వ్ స్టోరీస్ ఉంటాయి.ఈ సినిమా చూసిన తరువాత ఇందులో చేసిన  పాత్ర‌లు ప్ర‌తి ప్రేక్ష‌కుడు హ‌ర్ట్ లో నిలిచిపోతాయి.
 
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ?
ఈ సినిమా తర్వాత కృష్ణ వంశీ గారి రంగ మార్థండ సినిమాకు ఫైనాన్సియల్ అసోసియేట్ అయ్యాము సినిమా పూర్తి అయ్యింది.. ఎన్టీఆర్ బావ మరిదితో శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా చేస్తున్నాము.డబ్బింగ్ కూడా అయిపోయింది. రెండు సాంగ్స్ మినహా సినిమా పూర్తి అయ్యింది.డిసెంబర్ లో పూర్తి చేసుకొని  ఫిబ్రవరి లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాము.ఇవి కాకుండా ఇంకా కొన్ని కొత్త కథలు లైనప్ లో ఉన్నాయి  అని ముగించారు.