సంబంధిత వార్తలు
- రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ
- హీరోగా ఎంతో సపోర్ట్ చేశారు, నిర్మాతగా సపోర్ట్ చేయండి : మట్టి కుస్తీ ప్రీరిలీజ్ లో రవితేజ
- సర్పంచ్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థిని సన్మానించిన గ్రామస్థులు
- రవితేజ, గుత్తా జ్యాల గురించి విష్ణు విశాల్ ఏమంటున్నాడో తెలుసా?
- మరో యంగ్ హీరోకి తెలుగులో పాట పాడనున్న శింబు
రష్యన్ భాషలో పుష్పరాజ్ మేనరిజమ్స్- video
pupsha russia poster
ప్రస్తుతం పుష్ప చిత్రం రష్యా లో డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుందనే విషయం తెలిసిందే. విడుదలకి ఇంకో వారం మాత్రమే సమయం ఉండడంతో మేకర్స్ పుష్ప ట్రైలర్ ని రష్యన్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు. రష్యా భాషలోని ట్రైలర్ చూస్తుంటే మనకు భాష అర్ధంకాకపోయిన క్యారెక్టర్స్ ఏం మాట్లాడుతున్నారో మనకు అర్ధమవుతుంది. దీనికి కారణం పుష్ప చిత్రం మనపై చూపించిన ప్రభావమే. పుష్ప డబ్బింగ్ విషయంలో గట్టిగానే శ్రద్ధ తీసుకున్నారు. ఆయా పాత్రల మేనరిజమ్స్ రష్యన్ భాషలోను బాగానే వర్కౌట్ అయ్యాయి.
పుష్ప ది రైజ్ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్ర యూనిట్ రష్యా వెళ్లనున్నారు. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్బర్గ్ లో మీడియాతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. పుష్ప పార్ట్ 1కి వరల్డ్ వైడ్ గుర్తింపు వస్తే, అది పార్ట్ 2కి ఉపయోగ పడుతుంది. ఇక రష్యాలో ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డ్ సృష్టించబోతుందో చూడాలి.
