ఆదివారం, 29 జనవరి 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: శుక్రవారం, 2 డిశెంబరు 2022 (22:16 IST)

పవన్ రాలేకపోయారు... కారణం అదే.. అలీ వివరణ

pawan kalyan
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కల్యాణ్ - అలీ స్నేహ బంధం గురించి అందరికీ తెలిసిందే. అలీ పెద్ద కూతురు ఫాతిమా వివాహం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 
 
కానీ పవన్ మాత్రం రాలేదు. ఇందుకు అనివార్య కారణాల కారణంగా పవన్ రాలేకపోయారని అలీ వివరణ ఇచ్చారు. షూటింగ్ కోసం వెళ్లి.. ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో పవన్ రాలేకపోయారని చెప్పుకొచ్చారు.   
 
ఆ తర్వాత పవన్, తనకు ఫోన్ చేసి రాలేకపోతున్నానని అలీ చెప్పారు. ఇంటికి వచ్చి కలుస్తానని  చెప్పారని.. దీంతో అలీ ఇంటి పవన్ త్వరలో వెళ్లనున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాన్ స్వయంగా ఇంటికి వచ్చి కొత్త జంటను కలుస్తానని చెప్పారని అలీ పేర్కొన్నారు.