అకీరా లేటెస్ట్ లుక్స్ ఇంటర్నెట్‌లో వైరల్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా లేటెస్ట్ లుక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలకు మెగా అభిమానులు, నెటిజన్ల నుండి విపరీతమైన ఆదరణ వస్తోంది.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో తన పిల్లలు అకీరా, ఆద్యల క్యూట్ వీడియోను షేర్ చేసింది. వారి మధ్య కుంగ్ ఫూ యుద్ధం కొనసాగుతోందని వ్యాఖ్యానించింది.
వీడియోలో, అకీరా ఫేస్ క్లియర్‌గా లేదు. అన్నాచెల్లెల్లు ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం సరదాగా కనిపించింది. ఇప్పుడు ఈ పోస్ట్‌పై మెగా ఫ్యాన్స్ వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.