గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2022 (08:47 IST)

సారంగి వాయిద్య కారుడు మమన్‌ ఖాన్‌ను సోనూ సూద్ ఆపన్న హస్తం

maman khan
కరోనా కష్టకాలంలో వేలాది మందికి ఆపన్నహస్తం అందించిన బాలీవుడ్ రియల్ హీరో సోనూసూద్ మరోమారు పెద్ద మనసు చాటుకున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ సారంగి వాయిద్యకారుడు మమన్ ఖాన్ (83)కు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 
 
అనారోగ్యంతో బాధపడుతున్న మమన్ ఖాన్ ఫోటోను ఆయన షేర్ చేస్తూ ఆయన పరిస్థితిని వివరిస్తూ ఇంద్రజిత్ బర్కే అనే వ్యక్తి ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. మమన్ ఖాన్ ఈ రోజు చనిపోయే స్థితిలో ఉన్నారని, ఎక్కడి నుంచి సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
హర్యానా రాష్ట్రంలోని హిసార్ జిల్లా ఖరక్ పునియా గ్రామానికి చెందిన ఆయన భార్యా ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి పతకం, తామ్ర ఫలకం, అందుకున్నారని ఇంద్రజిత్ తన పోస్టులో గుర్తు చేశారు. ఇది సోనూసూద్ కంటపడింది. అంతే.. ఆయన ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. 
 
"ఖాన్ సాబ్ ముందు మీ ఆరోగ్యం నయం చేస్తా.. ఆ తర్వాత మీ సారంగి పాట వింటా" అంటూ సోనూసూద్ ట్వీట్ చేశారు. ఇలా సోనూసూద్ కామెంట్‌పై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ ఆయన్ను అభినందిస్తున్నారు.