శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (08:15 IST)

మైనర్ బాలికపై నేపాల్ క్రికెటర్ అత్యాచారం... అరెస్టు కోసం ఇంటర్ పోల్ సాయం

sandeep lamichhane
నేపాల్ క్రికెటర్ ఒకరు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ బాధితురాలి వయస్సు 17 యేళ్లు. ఈ బాలికను నేపాల్‌కు చెందిన స్టార్ క్రికెటర్ సందీప్ లమిచ్చనే అత్యాచారం చేశాడు. ఆ తర్వాత అదృశ్యమైపోయాడు. దీంతో అతని అరెస్టు కోసం పోలీసులు గాలించారు. కానీ ఆచూకీ లభించలేదు. లేదు ఇంటర్ పోల్ సాయం కోరారు. 
 
నేపాల్‍‌కు చెందిన 17 యేళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో సందీప్ కష్టాల్లో పడ్డారు. దీంతో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. నేపాల్ జట్టు కెప్టెన్ కూడా అయిన్ సందీప్ ఈ పాడుపనికి పాల్పడటంతో ఆయన్ను నేపాల్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది 
 
ప్రస్తుతం పరారీలో ఉన్న నేరస్ధుడి జాబితాలో ఉన్న సందీప్‌ను పట్టుకునేందుకు నేపాల్ ప్రభుత్వం ఇంటర్‌పోల్ సాయం కోరింది. స్పందించిన ఇంటర్‌పోల్.. సందీప్ సమాచారం చెప్పాలంటూ సభ్య దేశాలకు నోటీసులు జారీ చేసింది.
 
ఇంటర్ పోల్ నోటీసులు జారీచేసిన తర్వాత సందీప్ దారిలోకి వచ్చాడు. తాను వెస్టిండీస్ దీవుల్లో సీపీఎల్ పోటీల్లో ఆడుతున్నట్టు, తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని, ఆ యువతి చేస్తున్న ఆరోపణలు నిజం కాదనే విషయాన్ని నిరూపిస్తానని చెప్పాడు.
 
కాగా, 22 ఏళ్ల ఈ లెగ్‌స్పిన్నర్ ఐపీఎల్ అభిమానులకు సుపరిచతమే. 2018 నుంచి 2020 మధ్య ఢిల్లీ కేపిటల్స్‌కు ఆడాడు. బిగ్‌బాస్, సీపీఎల్ వంటి విదేశీ లీగుల్లోనూ ఆడుతుంటాడు.