1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (13:06 IST)

ఐసీసీ ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌: అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా

team india
ఐసీసీ ట్వంటీ-20 ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. తాజాగా సిరీస్‌ గెలిచిన భారత్‌ 268 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌ ఏడు పాయింట్లు వెనకబడిపోయి తర్వాతి స్థానంలో ఉంది. ఆస్ట్రేలియాతో సిరీస్‌ గెలిచి ఉత్సాహం మీద ఉంది టీమిండియా.
 
తాజాగా మరో వార్త భారత జట్టును, టీమిండియా అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. ఐసీసీ ప్రకటించిన టీ-20 ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో నిలిచింది టీం ఇండియా.
 
 హైదరాబాద్‌ వేదికగా భారత్‌ ఆసిస్‌ సిరీస్‌ జరిగిన ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 
 
నాగ్‌‌పూర్‌ ఓటమికి ప్రతీకారంగా తర్వాతి రెండు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. దీంతో టీమిండియా 268 పాయింట్లకు చేరింది. తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్‌ నిలిచింది.