శుక్రవారం, 14 జూన్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

ఆస్ట్రేలియాపై సిరీస్ విజయం - టీమిండియా అగ్రస్థానం పదిలం

team india
స్వదేశంలో పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత జట్టు 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ సిరీస్ గెలవడంతో భారత్ ఖాతాలో 268 పాయింట్లు సాధించి ఐసీసీ టీ20 ర్యాంకుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. అదేసమయంలో ఇంగ్లండ్‌ ఏడు పాయింట్లను కోల్పోయింది. రెండో స్థానంలో నిలిచింది. 
 
మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. నాగ్‌పూర్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ విజయభేరీ మోగించింది. చివరగా, హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన మూడో మ్యాచ్‌లోనూ భారత్ విజయభేరీ మోగించింది. ఫలితంగా భారత్ పాయింట్ల పరంగా అగ్రస్థానంలో నిలిచింది.