గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (15:30 IST)

సెప్టెంబరు 20 నుంచి ఆసీస్‌తో టీ20 సిరీస్ - మొహాలీలో ఫస్ట్ మ్యాచ్

cricket balls
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఈ పర్యటనలో భాగంగా, మంగళవారం నుంచి మొహాలీ వేదికగా తొలి టీ20 మ్యాచ్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో మూడు టీ20 మ్యాచ్‌లలో ఇరు జట్లూ తలపడతాయి. ఈ సిరీస్‌ను ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మెగా టోర్నీకి సహాహక సిరీస్‌గా ఇరు జట్లూ భావిస్తున్నాయి. 
 
తొలి మ్యాచ్ మొహాలీలో, రెండో మ్యాచ్ 23వ తేదీన నాగ్‌పూర్‌లో, మూడో మ్యాచ్ 25వ తేదీన హైదరాబాద్ నగరంలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన ఇరు జట్ల ఆటగాళ్ల వివరాలను పరిశీలిస్తే, 
 
భారత క్రికెట్ జట్టు... 
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, అశ్విన్, చహల్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ఉమేశ్ యాదవ్.
 
ఆస్ట్రేలియా...
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్ వెల్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, ఆస్టన్ అగర్, డానియల్ సామ్స్, నాథన్ ఎల్లిస్, జోష్ ఇంగ్లిస్, హేజెల్ వుడ్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా, షాన్ అబ్బాట్, కేన్ రిచర్డ్ సన్.