1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (13:38 IST)

ప్రియురాలితో శృంగారం చేస్తుండగా గుండెపోటుతో ప్రియుడు మృతి

deadbody
కర్నాటక రాష్ట్రంలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. తన ప్రియురాలితో ఏకాంతంగా శృంగారం చేస్తూ ప్రియుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన బెంగుళూరులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఈ నెల 16వ తేదీన బెంగుళూరులోని జేపీ నగర్ పుట్టెనహళ్లి ప్రాంతానికి చెందిన బాల సుబ్రమణియన్ అనే 67 యేళ్ల వృద్ధుడు తన ప్రియురాలి ఇంటికి వెళ్లి ఆమెతో శృంగారంలో పాల్గొన్నాడు. ఆ సమయంలో ఆ వ్యక్తిని గుండెపోటు రావడంతో మంచంపైనే ప్రాణాలు కోల్పోయాడు. ప్రియుడి ఆకస్మిక మరణంతో భయపడిన ప్రియురాలు తన భర్త, సోదరుడితో కలిసి శవాన్ని జేపీ నగరులోని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. 
 
ఓ ప్లాస్టిక్ సంచిలో వృద్ధుడి శవం ఉండటాన్న గుర్తించిన స్థానికలు పోలీసులకు సమాచారం చేరవేశారు. దీంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో బాలసుబ్రమణ్యంగా గుర్తించారు. 67 యేళ్ల వ్యాపారవేత్త అయిన వృద్ధుడికి 35 యేళ్ల పనిమనిషితో వివాహేతర సంబంధం ఉందని తేలింది. ప్రియురాలితో ఎంజాయ్ చేసేందుకు వచ్చిన వృద్ధుడు ఆమెతో శృంగారంలో ఉండగా గుండెపోటు వచ్చి ప్రాణాలు విడిచినట్టు తేలింది.