శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (12:44 IST)

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినికి లైంగిక వేధింపులు

victim woman
ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలోని బాసర ట్రిపుల్ ఐటీలో ఏదో ఒక వివాదం చెలరేగుతూనే వుంది. ఫలితంగా నిత్యం వార్తలకెక్కుతుంది. మొన్నటికిమొన్న అక్కడ విద్యాభ్యాసం చేసే విద్యార్థులు చేసిన మెరుపు ఆందోళన రాష్ట్రంలో సంచలనమయ్యాయి. ఇపుడు మరో సంఘటన జరిగింది. ఇక్కడ చదువుకునే ఓ విద్యార్థినిని కొందరు లైంగికంగా వేధించారు. 
 
దీనిపై బాధిత విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ చర్యలు తీసుకున్నారు. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. వారి మొబైల్ ఫోన్లు సీజ్ చేయడమేకాకుండా, విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ లైంగిక వేధింపుల వార్త ఇపుడు బాసర ట్రిపుల్ ఐటీలో కలకలం రేపుతున్నాయి. లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.