శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 21 నవంబరు 2022 (11:29 IST)

బెంగాల్ చిత్ర పరిశ్రమలో విషాదం... 24 యేళ్ళకే నటి మృతి

andrila sharma
బెంగాల్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. 24 యేళ్లకే నటి అండ్రిలా శర్మ కన్నుమూశారు. కార్డియాక్ అరెస్టు కారణంగా ఆమె తుదిశ్వాస విడిచారు. కార్డియాక్ అరెస్టు కావడంతో ఆమెను హౌరాలోని ఓ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
అండ్రిలా కొన్నాళ్ళ క్రితం రెండు క్యాన్సర్లను పోరాడి గెలిచారు. బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆమెను ఈ నెల ఒకటో తేదీన ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతుండగా, కార్డియాక్ అరెస్టు కావడంతో కన్నుమూశారు. 
 
ఆదివారం మరోమారు కార్డియాక్ అరెస్టు కావడంతో తుదిశ్వాస తుడిచారు. ఆమె మృతి పట్ల వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా అండ్రిలా కుటుంబానికి ఆమె సానుభూతి ప్రకటించారు.