శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 నవంబరు 2022 (13:28 IST)

వివాహితను హత్య చేసి ఫేస్‌బుక్‌ లైవ్‌‌లో నిజం చెప్పి ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

crime scene
తనతో అక్రమ సంబంధం కొనసాగించిన వివాహితను ముందుగా హత్య చేసిన ప్రియుడు.. హత్య చేసినట్టు ఫేస్‌బుక్ లైవ్‌లో వెల్లడించి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. తనతో అక్రమ సంబంధం పెట్టుకున్న వివాహిత.. కట్టుకున్న భర్తను వదిలి తన వద్దకు రాకపోవడంతో ఆ కిరాతక ప్రియుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగాల్ రాష్ట్రంలోని సిలిగిరి ప్రాంతానికి చెందిన రియా బిస్వాస్ అనే మహిళకు ఇది వరకే వివాహమై భర్త, ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. ఈమెకు అదే ప్రాంతానికి చెందిన కిరణ్ దేబ్‌నాథ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇది గత రెండేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కట్టుకున్న భర్తను వదిలేసి తనతో రావాలంటూ రియాపై కిరణ్ ఒత్తిడి చేయసాగాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం రాత్రి రియా ఇంటికి కిరణ్ వెళ్లాడు. ఇదే విషయంపై వారిద్దరి మధ్య గొడవ జరిగింది. భర్తను వదిలి కిరణ్‌తో వెళ్లేందుకు రియా అంగీకరించలేదు. దీంతో ఆగ్రహించిన కిరణ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో రియా గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని బాత్రూంలో పడిసే ఏమీ ఏరుగనట్టుగా ఇంటికి వెళుతూ రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఈ ఆత్మహత్యకు ముందు కిరణ్ ఫేస్‌బుక్‌ లైవ్‌లోకి వచ్చి తాను రియను చంపేశానని, భర్తను వదిలి తనతో వచ్చేందుకు నిరాకరించడం వల్లే ఈ పని చేసి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. ఆ తర్వాత సూసైడ్ చేసుకున్నాడు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.