శనివారం, 25 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated: మంగళవారం, 8 నవంబరు 2022 (17:51 IST)

తిరుపతిలో ప్రేమజంట ఆత్మహత్య

suicide
తిరుపతిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడ వీధిలోని ఓ లాడ్జిలో సోమవారం ఉదయం ఏడు గంటలకు ఓ ప్రేమ జంట గదిని అద్దెకు తీసుకుని దిగారు. ఆ గదిలో వీరిద్దరూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. 
 
ఈ యువతికి ఇటీవలే మరో యువకుడితో వివాహమైంది. నిజానికి ఈమె మరో యువకుడితో చాలాకాలంగా ప్రేమలో ఉంది. తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేక ఆ యువతి తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
మృతురాలిని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూషగా గుర్తించగా, యువకుడిని హైదరాబాద్ నగరానికి చెందిన కృష్ణారావుగా గుర్తించారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు.